వర్మ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ (CDC)
- Category: Foundation Activities
- Date: 23-07-2025
వర్మ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ (CDC), వర్మ ఫౌండేషన్ నుంచి ప్రేరేపితమైన, ఇది పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న పిల్లలకు సహాయపడేందుకు ఏర్పాటు చేయబడింది. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ సేవలతో మానసిక ఎదుగుదల సమస్యలను పరిష్కరించడంలో
వర్మ ఫౌండేషన్ సహాయపడుతుంది.
వర్మ ఫౌండేషన్ యొక్క ముఖ్య/ ప్రధాన లక్ష్యం ఏమిటంటే, పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలను గమనించబడకుండా, లేదా చికిత్స అందకుండా ఉండకూడదని ద్యేయంగా, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించడం ద్వారా, ఈ సంస్థ చికిత్సలో లోపాలను పూరించి, దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో తగిన చికిత్సలను అందించడంలో సహాయపడుతుంది.
ఈ వైద్య శిబిరంలో ఎవరైతే మానసిక, ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నరో అటువంటి 52మంది పిల్లలను వర్మ ఫౌండేషన్ వారు, గుర్తించి ప్రముఖ అనుభవజ్ఞులైన మరియు గుర్తింపు పొందినటువంటి వైద్యులైన
సైకాలజిస్టులు,
సైకియాట్రిస్టులు
సైకోథెరపిస్టుల
పర్యవేక్షణలో ఉచితంగా చికిత్స అందించబడినది.
వ్యాధులను నిర్ధారించుటకే 4 నుంచి 5 వేల వరకు ఖర్చు అవును కానీ, ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే తమ ఆర్థిక పరిస్థితుల దృశ్య తమ వైద్య ఖర్చులు కూడా భరించలేని 15 మంది పిల్లలకు ఉచిత మానసిక వైద్య చికిత్స మన వర్మ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అందింపబడుతున్నది.
వర్మ ఫౌండేషన్ యొక్క ప్రధాన ధ్యేయం ఎటువంటి లాభాలను ఆశించకుండా ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలను అందించడం, మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లలకు తెరపి, స్పెషల్ ఎడ్యుకేషన్, మరియు కౌన్సిలింగ్ అందించడంలో సహకారం అందిస్తుంది.
ఇటువంటి మానసిక ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి. వారికి సమాజంలో ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలన్నదే ఈ వర్మ ఫౌండేషన్ వారి ప్రయత్నం.
“మానసిక సమస్యలతో ఉన్న బిడ్డలకు తల్లి జన్మనిస్తే అటువంటి సమస్యలు ఉన్న బిడ్డలను గుర్తించి మన వర్మ ఫౌండేషన్ చేయూతనిస్తుంది.”
